Saturday, November 23, 2024

కేంద్రం ధాన్యం కొంటదా.. కొనదా?: బీజేపీ డ్రామాలు ఆపాలన్న మంత్రి గంగుల

తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా? అన్నది కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు మంత్రి గంగుల కమలాకర్‌. వ‌రి ధాన్యం కొనాలంటూ నేడు తెలంగాణ బీజేపీ నేత‌లు ఆందోళ‌న‌లు చేస్తోన్న నేప‌థ్యంలో మంత్రి గంగుల తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రం ప్రభుత్వం ఒక‌ వైపు ధాన్యం కొంటుంటే, మ‌రోవైపు బీజేపీ నేతలు మాత్రం ధర్నాల పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌ని చెప్పారు. రాష్ట్ర‌ బీజేపీ నేతలు ధ‌ర్నాలు చేయాల్సింది తెలంగాణ‌లో కాద‌ని, ఢిల్లీలో చేయాల‌న్నారు. ధాన్యం కొనుగోళ్లు జర‌పాల‌ని కేంద్ర స‌ర్కారుకి చెప్పాల‌ని గంగుల క‌మ‌లాక‌ర్ డిమాండ్ చేశారు. అస‌త్యాలు ప్ర‌చారం చేస్తూ బీజేపీ నేత‌లు బతుకుతున్నారని విమర్శించారు. యాసంగి పంట మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనాలన్న మంత్రి.. రైతుల జీవితాలతో కేంద్రం ఆడుకోవ‌ద్ద‌ని కోరారు. రైతులు పండించే వానాకాలం పంట ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని మంత్రి గంగుల స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివకే 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement