Tuesday, November 26, 2024

టీఆర్ఎస్ కు ఓటేయండి: మార్నింగ్ వాకర్లతో మంత్రి గంగుల

హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు తథ్యమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శుక్రవారం ఉదయం నియెజకవర్గ నేతలతో కలిసి హుజురాబాద్ ప్రజల్ని మార్నింగ్ వాక్ లో కలుసుకున్నారు. దుకాణాలు, సెలూన్లు, చిరువ్యాపారులు, గ్రౌండ్ల మార్నింగ్ వాకర్లతో కలిసి ముచ్చటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు మద్దతివ్వాలో వివరించారు.

కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని చావునోట్లో తలపెట్టి తెచ్చిన తెలంగాణను అదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. గత 20 సంవత్సరాలుగా ఈటెల రాజేందర్ నిర్లక్ష్యంతో హుజురాబాద్ లో నిలిచిపోయిన అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.50 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. ప్రజలు, కుల సంఘాల నేతలు, ఆటో యూనియన్ వాళ్లే స్వచ్చందంగా డబ్బులు జమ చేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ నామినేషన్ ఫీజు కడుతామన్నారని చెప్పారు. దీంతోనే గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ విజయం ఖాయమైందన్నారు.

గతంలో హుజారాబాద్ అస్థవ్యస్తంగా ఉందని, సరైన రోడ్లు,తాగునీరు, పారిశుద్యం, ఆరోగ్య వసతులు, కుల సంఘాల కమ్యూనిటీ హాళ్లు లేక ప్రజలు పడ్డారని అన్నారు. దీంతో ఈ సమస్యలన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగానే.. ద్రుష్టికి తీసుకెళ్లగానే నిధుల్ని మంజూరు చేసారని చెప్పారు. రూ. 50కోట్ల నిధులతో సీసీరోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, అన్ని కులసంఘాల ఆత్మగౌరవం పెంచేలా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామన్నారు. నియోజవకవర్గంలో అభివృద్ధి మరింత కొనసాగాలంటే.. టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని మంత్రి గంగుల అభ్యర్థించారు.

ఇది కూడా చదవండి: హుజూరాబాద్ ఉప ఎన్నిక: టిఆర్ఎస్ అభ్యర్థికి బి ఫాం ఇచ్చిన కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement