Saturday, November 16, 2024

బసవేశ్వరుడి జయంతి వేడుక.. వీరశైవ సామాజిక వర్గం అభ్యున్నతికి కృషి

సంఘ సంస్కర్త, సామాజిక తత్వవేత్త బసవేశ్వరుడి జయంతిని ప్రభుత్వం అధికారికంగా  నిర్వహిస్తుందని  మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ సుభాశ్ నగర్ 23వ డివిజన్ లోవీరశైవ మహాసభ ఆధ్వర్యంలో మహాత్మ శ్రీ బసవేశ్వర 889వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా మహా దేవునికి ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీర శైవ కులస్థుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీర శైవుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరు మహాత్మ బసవేశ్వరుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని మంత్రి గంగుల పిలుపునిచ్చారు.

మనదేశంలో లాగా పాశ్చత్త్య దేశాలలో కులాలు కనిపించవని, అందుకే ఆ దేశాలు అభివృద్దిలో ముందుకు దూసుకుపోతున్నాయన్నారు. నాటి కాలంలోనే కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని నగరంలో ప్రతిష్టించేందుకు కృషి చేస్తానన్నారు. అంతే కాకుండా 5 లక్షల రూపాయలతో వీరశైవులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తామని హామి ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement