Monday, November 18, 2024

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ.. నిఖార్సయిన తెలంగాణ వాది: మంత్రి ఎర్రబెల్లి

స్వాంత్రంత్య సమరయోధులు, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వ‌రంగ‌ల్‌లో ఆయ‌న విగ్ర‌హానికి మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిబద్ధత గల రాజకీయవేత్త కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయ‌న నిఖార్స‌యిన తెలంగాణ వాది అని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో, నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ ఆయ‌న‌ చురుకుగా పాల్గొన్నారు. 97 ఏండ్ల వయస్సులో కూడా తెలంగాణ కోసం పరితపించి మలి దశ ఉద్య‌మంలో పాల్గొన్నార‌ని మంత్రి గుర్తు చేశారు.

ఆసిఫాబాదు నుంచి శాసనసభ్యుడిగా అనేక సార్లు ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి అనేక సేవలందించారు. బడుగు, బలహీనవర్గాల అభివృద్ది కొరకు కొండా లక్ష్మణ్ బాపూజీ విశేష కృషి చేశార‌ని ప్ర‌శంసించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయ ఏర్పాటుకు తాను వుంటున్న జల దృశ్యాన్ని అప్పగించిన మహోన్నత వ్యక్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోతారు అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement