Sunday, November 10, 2024

కర్షకుల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం

కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలోని టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మేడే సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి పలు చోట్ల జెండాలు ఆవిష్కరించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో యువ చైతన్య యూత్ ఆటో యూనియన్, కామారెడ్డి గూడెంలో హమాలీ సంఘం, పాలకుర్తి లో citu ల అధ్వర్యంలో మేడే జెండాలు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మాణ రంగంలోని కార్మికుల సంక్షేమానికి గత ఏడాదిలో 176.91కోట్ల రూపాయల లబ్ది చేకూర్చిందని అన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వారా 32,350 మంది కార్మికులకు 184.07 కోట్ల రూపాయల ప్రయోజనం చేకూరిందని చెప్పారు. కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్‌ చేసిందన్నారు. దీని ద్వారా కార్మికులకు ఎక్కడి నుంచైనా ప్రభుత్వ సహకారం పొందే అవకాశం లభిస్తున్నది అని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు వల్ల అంతర్జాతీయ కంపెనీలు మన రాష్ట్రంలో తమ కంపెనీ లను పెడుతున్నాయని మంత్ర ఎర్రబెల్లి వివరించారు. దీని ద్వారా కార్మికులకు అంతర్జాతీయ స్థాయి నాణ్యత ప్రమాణాలతో కూడిన ఉపాధి, వేతనం దొరుకుతున్నదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement