హనుమకొండ, ప్రభన్యూస్ : గేట్-2022లో ఆల్ ఇండియా టాపర్ గా నిలిచిన వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) లో బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చదువుతున్న తెలంగాణ విద్యార్థి సందీప్ రెడ్డికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు. గేట్-2022లో దేశంలోని టాపర్ గా నిలిచిన వరంగల్ విద్యార్థి యంగ్ స్టర్ సందీప్ రెడ్డి అని ఆయన అన్నారు.
అదేవిధంగా గేట్-2022 లో మెటలర్జీ ఇంజనీరింగ్ లో 9వ స్థానం సాధించిన మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం లోని చీకటాయపాలెంకు(పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం) చెందిన నిరంజన్ కు కూడా మంత్రి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఉన్నత విద్య అభ్యసించి, ఉన్నత స్థాయికి చేరాలని మంత్రి ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..