రామగిరి, ఆంధ్రప్రభ : శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాష్ర్ట పరిశ్రమలు అండ్ ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మాట్లాడుతూ… శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కరుణ, కటాక్షాలు అందరి మీద ఉండాలని, ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని వేడుకున్నామన్నారు. రాష్ట్రంలో, నియోజకవర్గంలో రైతులు పాడి పంటలతో తులతూగాలని కోరుకోవడం జరిగిందన్నారు. అనంతరం శ్రీ విఖనస సుధర్మా సేవా సమితి ఆధ్వర్యంలో సర్వకామప్రద సుదర్శన సహిత లక్ష్మి నృసింహ యాగ వైభవం కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -