సంగారెడ్డి, ఆగస్టు 8 (ప్రభ న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తనిఖీ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతిలతో కలసి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు.
అనంతరం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులతో మాట్లాడిన మంత్రి దామోదర రాజనర్సింహ… ఆసుపత్రిలో మందులు అందుబాటులో ఉన్నాయా అని ఆసుపత్రి రోగులను అగిడి తెలుకున్నారు.. ఆసుపత్రిలో సేవలపై అరా తీశారు. నూతనంగా నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలిస్తూ మెడికల్ కళాశాల ఆవరణలో నూతన భవనాల నిర్మాణ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయి. పనుల ఆలస్యంపై అధికారులను నిలదీశారు. ప్రభుత్వ నిధులు ఉన్నాయి కదా..? ఎందుకు ఇంత ఆలస్యం…? పని చెయ్య లేకపోతే వెళ్లిపోండి అని ఆర్ అండ్ బి ఈఈ రాంబాబును మంత్రి దామోదర రాజానరసింహ సీరియస్ అయ్యారు.