Sunday, January 5, 2025

MDK | కబడ్డీ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించిన మంత్రి దామోదర రాజ‌న‌ర్సింహా

  • ముగిసిన టెన్త్ జోనల్ లెవల్ గేమ్స్
  • విజేతలకు బహుమతులు అందజేత


ఉమ్మడి మెదక్ బ్యూరో : సంగారెడ్డి జిల్లా అందోలులోని గురుకుల పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన టెన్త్ జోనల్ లెవల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ గురువారం ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై ముగింపు వేడుకలను ప్రారంభించారు.

క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో పాటు కబడ్డీ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు. ముగింపు సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ… క్రీడలతో మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం పెరుగుతుందని, నిత్య యవ్వనం ఉట్టిపడుతుందన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిమ కనబరిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చన్నారు. దాంతో పాటు క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement