Wednesday, January 22, 2025

MBNR | 150పడకల ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి దామోదర రాజనర్సింహా భూమిపూజ

మక్తల్, జనవరి 22 (ఆంధ్రప్రభ) : నియోజకవర్గ కేంద్రం మక్తల్ పట్టణంలో రూ.45కోట్ల వ్యయంతో నిర్మించనున్న 150పడకల నూతన ఆసుపత్రి నిర్మాణ పనులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి ఇవాళ సాయంత్రం భూమిపూజ చేశారు.

అదేవిధంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్, డీఎంహెచ్ఓ డాక్టర్ సౌభాగ్య లక్ష్మీ, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ గవినోళ్ళ బాలకృష్ణ రెడ్డి, మాజీ జడ్పీటీసీ జి.లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement