Sunday, November 17, 2024

Mini Moon – ఆకాశంలో నేటి నుంచి ఇద్ద‌రు చంద్రులు

చంద్రుడు ప‌క్క‌నే మ‌రో మినీ చంద‌మామ‌
అర్ధ‌రాత్రి 1.30 త‌ర్వాత టెలిస్కోప్ లో వీక్షించ‌వ‌చ్చు
రెండు నెల‌ల పాటు చంద్రుడు చుట్టు ప్ర‌ద‌క్షిణం

భూమికి ఎన్ని సహజ ఉపగ్రహాలు అంటే . చంద్రుడు ఒక్కడే కదా అని అంతా చెబుతాం. అయితే, ఇప్పుడు మరో ”మిని చంద్రుడు” కూడా చంద్రుడికి తోడుగా రాబోతున్నాడు. కొన్ని రోజుల పాటు భూమికి రెండు చంద్రులు ఉండబోతున్నారు. ఈ రోజు రాత్రి నుంచి ఈ ”మిని మూన్” భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయబోతోంది. “2024 PT5” అని పిలవబడే ఇది కేవలం పది మీటర్ల వ్యాసం కలిగిన ఈ చిన్న చంద్రుడు, 53 రోజుల పాటు భూమి చుట్టూ కక్ష్యలో తిరుగుతాడు. ఆ తర్వాత సౌర కుటుంబంలోని సుదూరాలకు వెళ్తాడు.

దీని పరిమాణం మన చంద్రుడితో పోలిస్తే 3,50,000 రెట్లు చిన్నది. చంద్రుడి వ్యాసం 3476 కి.మీ., మిని చంద్రుడి వ్యాసం కేవలం 10 మీటర్లు మాత్రమే. సాధారణంగా ఇది కంటికి కనిపించదు. ప్రత్యేకమైన టెలిస్కోపులతో చూడాల్సి వస్తుంది. అది కూడా తెల్లవారుజామున. 1.30 గంటల తర్వాత దానిని గుర్తించవచ్చు. ఈ గ్రహశకలం భూమిని ఢీకొట్టదని నిర్ధారించారు. మినీ మూన్ భూమి చుట్టూ దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాదాపుగా రెండు నెలల పాటు పరిభ్రమిస్తుంది. సెప్టెంబర్ 30 నుంచి దాదాపు 2 నెలలు భూమి చుట్టూ తిరుగుతుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement