Tuesday, November 12, 2024

MIM Voice – ముస్లీంల అణిచివేత‌కే పౌర చట్టాలు – ఎంపీ అస‌దుద్దీన్

అందుకే సీఏఏ చ‌ట్టం అమ‌లు
తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసిన ఎంపీ అస‌దుద్దీన్
ఎన్నిక‌లు కాగానే పూర్తిస్థాయిలో అమ‌లు చేసే అవ‌కాశం
అయిదేళ్లు కోల్డ్ స్టోరేజ్‌లో ఉన్న చ‌ట్టం
ఇప్పుడెందుకు బ‌య‌టికి తెచ్చారంటూ మోదీకి ప్ర‌శ్న‌

హైద‌రాబాద్ – పౌరసత్వ సవరణ చట్టంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏను ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీలతో కలిపి చూడాలని అప్పుడే దాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలమన్నారు. లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన తీరు ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్ సీఏఏపై కేంద్రం తీరు ఏంటో స్పష్టంగా తెలిసిపోతుంది అన్నారు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌లో ఆయ‌న త‌న అభిప్రాయాల‌ను పోస్ట్ చేశారు. దేశంలో పేదలు, దళితులు, మైనారిటీలు, ముస్లింలకు చోటు లేకుండా చేయడమే సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్ఆర్‌సీ లక్ష్యమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక.. ఎన్నికలు రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయని బీజేపీపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

హింస‌కు గురైన వారికి ఆశ్ర‌య‌మివ్వాలి..

ఇక.. పౌరసత్వ సవరణ చట్టంపై తమకు అభ్యంతరాలున్నాయని ఎంఐఎం చీఫ్ అస‌దుద్దీన్ అన్నారు. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో పెట్టారని ప్ర‌ధాని మోదీని ప్ర‌శ్నించారు. సీఏఏ ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో మోదీ సర్కార్ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముస్లింలే లక్ష్యంగా సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌ తెచ్చారని ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement