Tuesday, November 19, 2024

MIM Political Stand – ఈసారి ఆట‌ మేం ఆడుతాం … అత్య‌ధిక‌స్థానాల‌లో పోటీ చేస్తాం – ఎంపి అసదుద్దీన్

నిజామాబాద్ సిటీ,జూన్ (ప్రభ న్యూస్)26: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయం తర్వాత ఆలోచిస్తాం,తెలంగాణ లో మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని ఎంఐఎం పార్టీ అధ్యక్షులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. అధికారం ఎప్పుడూ ఎవ్వరికి శ్వాశతం కాదని.. పవర్ మీ చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరి స్తున్నారని…. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకో వాలని అన్నారు. బోధన్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ పై హత్యా యత్నం చేశారని మా ఎంఐఎంనేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఎమ్మెల్యే షకీల్, వారి అనుచరులు పై హత్యాయత్నం కేసులో… అరెస్ట్ అయిన ఎంఐఎం కౌన్సిలర్ ల ను సోమవారం నిజాంబాద్ జిల్లాలోని సారంగాపూర్ జైల్లో ఓవైసీ పరామర్శించారు.

అనంత‌రం నిజాంబాద్ నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓవైసీ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో కవిత షకీల్ కు కష్టపడి పనిచేసిన నాయకుల పైనే ప్రస్తుతం అక్రమ కేసు లు బనాయించి ఇరికించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. బోధన్ నియోజకవర్గంలో జరుగుతున్న అంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బీఆర్ఎస్ కు ప్రజలు గుణపాఠం చెబుతారని భీమా వ్యక్తం చేశారు. అసలు నిజానికి బోధన్ నియోజకవర్గంలో ఎవరిపైన ఆరోపణలు వచ్చా యో వారిపై విచారణ జరప డం లేదని వాపోయారు. అదే విధంగా హైదరాబాదులో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయని బోధన్ ఎసిపి, ఇన్స్పెక్టర్ ను వెంటనే హైదరాబాద్ కుబదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం పార్టీ ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. ఎంఐఎం ఎక్కడ పోటీ చేస్తుందో పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. ఇండియాలో ఏ ఎన్నికలు అయినా కష్టపడాలన్నారు.తెలంగాణలో ఎలాగైనా పోటీ చేస్తాం కానీ ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు పోటీ చేస్తాం అనేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు.ఎంఐఎం పార్టీ బలపడటం కోసం ముందుగా పని చేస్తామన్నారు.ఆ పై ఏ పార్టీకి మద్దతు ఏ పార్టీతో ముందుకు వెళ్లాలనేది ఆలోచిస్తామని పేర్కొన్నారు.పాట్నా మీటింగ్ కు నన్ను ప్రతిపక్ష పార్టీలు పిలవలేద న్నారు.2024 లో మోడీని ఓడించేందుకు మేము వ్యక్తిగ తంగా శాయశక్తులా ప్రయత్నం చేస్తామని తెలిపారు. తెలం గాణలో మేము కూడా ప్రత్యామ్నాయమే అని చెప్పారు.తెలంగాణలో గెలుపోటములు ప్రజలు నిర్ణయిస్తారన్నారు.
.
ఈ సమావేశంలో ఎంఎం జిల్లా అధ్యక్షులు షకీల్, భైంసా మున్సిపల్ చైర్మన్ జాబీర్ అహ్మద్,, ఏంఎం నాయకులు,డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, సాబేర్, ముషీర్ ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement