హైదరాబాద్ – అసెంబ్లీలో ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని నియమించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.. ఈ మేరకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకీ సీఎం రేవంత్ రెడ్డి సమాచారం అందించినట్లు వార్తలు వినవస్తున్నాయి… కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించేందుకు రేపు ఒక రోజు అసెంబ్లీ సెషన్ జరగనున్నది. సభలో సీనియర్లుగా ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరిని ప్రొటెమ్ స్పీకర్‌గా ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ప్రస్తుతం ఎన్నికైన సభ్యుల్లో మాజీ సీఎం కేసీఆర్ సభలో అందరి కంటే సీనియర్. ఆయన ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.. అయితే ఆయన ఆసుపత్రిలో చేరడంతో రేపటి అసెంబ్లీ సమావేశానికి దూరంగానే ఉండనున్నారు. ఆ తరువాత మాజీ స్పీకర్ పోచారం, మాజీ మంత్రి హరీష్ రావు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో పాటు మరికొందరు సీనియర్లుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కెసిఆర్ తర్వాత సీనియర్ సభ్యుడిగా ఉన్న అక్బరుద్దీన్ నే ప్రొటెమ్ స్పీకర్ గా ఎంపిక చేశారని అంటున్నారు..