Tuesday, November 26, 2024

సైనిక స్కూల్‌, డిగ్రీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. దేశానికే ఆదర్శం తెలంగాణ గురుకులాలు : మంత్రి కొప్పుల

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రుక్మాపూర్‌ సైనిక స్కూల్‌, బీబీనగర్‌ మహిళా సైనిక్‌ డిగ్రీ కళాశాలల ప్రవేశ పరీక్ష ఫలితాలను ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ విడుదల చేశారు. ఈ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం మార్చి 27న ప్రవేశ పరీక్షను నిర్వంచారు. వాటి ఫలితాలను గురువారం మంత్రి కొప్పుల తన క్యాలయంలో విడుదల చేశారు. రుక్మాపూర్‌ పాఠశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశ పరీక్ష 3,550 మంది రాయగా, ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల అనంతరం 78 మందికి ప్రవేశాలు లభించాయి. సొసైటీలోని 30 మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు హాజరైన 26 వేల మందిలో 956 మంది బీబీనగర్‌ కాలేజీని కోరుకోగా, వీరిలో 126 మందికి మాత్రమే ప్రవేశాలు లభించాయి. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ గురుకులాలు విద్యారంగంలో దేశానికే ఆదర్శమని అన్నారు.

అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యవంతులుగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని అన్నారు. ఐదు సొసైటీలలో కలిపి మొత్తం 981 గురుకుల పాఠశాలలు నడుస్తున్నాని అన్నారు. వీటిలో సుమారు 6 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారని, అందరికీ ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో నడిచే సైనిక స్కూల్‌, సైనిక్‌ డిగ్రీ కాలేజీల్లో మౌలిక సధుపాయాలు బాగున్నాయని ఆయన తెలిపారు. ఈ సంస్థలు విద్యార్థులును గొప్పగా తీర్చిదిద్దుతున్నాయని, అత్యుత్తమైన అకాశాలతో భవిష్యత్‌ ఉంటుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement