Tuesday, November 26, 2024

అర్ధ‌రాత్రి విద్యుత్‌ షార్ట్​ సర్క్యూట్​.. కాలి బూడిదైన ఇల్లు, సామ‌గ్రి

బిక్కనూర్ (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మల్లుపల్లిలో నిన్న (శుక్రవారం) అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంతో అప్రమత్తమైన ఆ ఇంటి సభ్యులు బయటికి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. మోకాళ్ల బాపురెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి.

నిద్ర నుంచి మేల్కొన్న కుటుంబసభ్యులు బయటకు పరుగులు తీశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణనష్టం జరగకపోయినా పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీటీసీ సభ్యుడు మోహన్ రెడ్డి కోరారు. విషయం తెలుసుకున్న ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement