Tuesday, November 19, 2024

Deputy CM: సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రొత్స‌హిస్తాం…. డిప్యూటీ సిఎం భ‌ట్టి

దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి ఉత్పత్తి రంగంలో ఉన్నటువంటి వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణ వైపు నడిపించడానికి గత ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రణాళికలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో నేడు టూరిజం ప్లాజాలో నిర్వహించిన వెండర్స్ డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథి హాజ‌రై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, సువిశాలమైన భారతదేశంలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికిని ఉత్పత్తి రంగాలన్నింటినీ పంచవర్ష ప్రణాళికలు గానీ మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు దేశ పురోగతిలో కీలక పాత్రను పోషిస్తున్నాయన్నారు. ప్రపంచీకరణ సరళీకరణ వచ్చిన తర్వాత దేశంలోకి వచ్చిన తర్వాత మల్టీ నేషనల్ కంపెనీలు మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను మింగేశాయని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వెల్త్ ఒకే చోట ఉండటం ప్రజాస్వామ్యానికి, సమాజానికి ప్రమాదకర‌మ‌ని అంటూ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ ను ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంద‌ని చెప్పారు. ఉద్యోగ ఉపాధి కల్పన సమానత్వం సామాజిక న్యాయం వృద్ధిరేటు పెరగడానికి ఎంఎస్ఎంఈ తోడ్పాటు అవుతుంది అని తెలిపారు.

భూతద్దంలో పెట్టి వెతికిన మల్టీ నేషనల్ కంపెనీల వల్ల సామాజిక న్యాయం సమానత్వం ఉద్యోగ ఉపాధి కల్పన కనిపించదు అని చెప్పారు.. మల్టీ నేషనల్ కంపెనీలతోనే అభివృద్ధి సాధ్యం అన్నది గ్లోబల్స్ ప్రచారం మాత్రమేన‌ని అయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ను పెంచుతామ‌ని, ప్రభుత్వ పరంగా ప్రోత్సహకాలు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు.. ఇండస్ట్రియల్ క్లస్టర్స్ పెంచి యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా, మేధోపరంగా సహకారం అందిస్తే పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతుంద‌ని అన్నారు. దీని వల్ల దేశ వృద్ధిరేటు పెరగడానికి దోహదపడుతుంది అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

వనరులు సమానంగా పంచి, సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వాములు చేయడం వల్లనే సమ సమాజ స్థాపన జరుగుతుంద‌ని తేల్చి చెప్పారు. సంపద సృష్టించే రంగాల్లో అందరిని భాగస్వామ్యం చేయకుంటే దేశంలో అసమానతలు పెరిగిపోవడం ఈ సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. ఎస్సీ, ఎస్టీ యువ పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ప్రోత్సాహకాలు అందిస్తుంద‌ని వెల్ల‌డించారు…. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు మ‌రిన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement