Monday, September 16, 2024

TG | వెనక్కి త‌గ్గిన‌ మెట్రో.. ఇక ఫ్రీ పార్కింగ్

మెట్రో స్టేషన్ ఆవరణలో వెహికిల్స్ పార్కింగ్ ఫీజుల విషయంలో హైదరాబాద్ మెట్రో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగోల్ మెట్రో పార్కింగ్ స్థలంలో ఆగస్టు 25 నుంచి.. మియాపూర్ మెట్రో పార్కింగ్‌లో స్థ‌లంలో సెప్టెంబర్ 1 నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేస్తామని ఎల్ అండ్ టీ మెట్రో అధికారులు వెల్లడించగా.. తాజాగా ఆ ప్రకటన నుంచి వెనక్కి తగ్గారు.

నాగోల్, మియాపూర్ మెట్రో స్టేష‌న్ల‌లో పెయిడ్ పార్కింగ్ ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల నుంచి మరిన్ని సూచనలు, సలహాలు తీసుకున్న అనంతరం కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మియాపూర్, నాగోల్ మెట్రో స్టేషన్ల పరిసర ప్రాంతాల్లోని పార్కింగ్ ప్లేస్‌లో ఫ్రీ వెహికిల్ పార్కింగ్‌కు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement