Tuesday, November 26, 2024

నష్టాల్లో మెట్రో.. ఆదుకోని ప్రభుత్వం..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: హైదరాబాద్‌లో అత్యా ధునిక రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మెట్రోరైల్‌ సర్వీసు ప్రారంభించింది. ప్రస్తుతం మూడు కారిడార్లలో రోజుకు 820 ట్రిపుల ద్వారా 2 లక్షల మందికిపైగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే మంచి ఆదరణ దక్కడంతో మెట్రో అధికారులు ప్రభుత్వం హర్షం వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు కోసం పలు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు ఏటా వడ్డీ కిందే రూ. 1412 కోట్లు చెల్లించాల్సి వస్తోందని అధికారులు అంటున్నారు. గతంలో మాదిరిగా షాపింగ్‌ మాల్స్‌ నిర్వహణ సరిగా లేక పోవడం, యాడ్స్‌ ఆదాయం తగ్గడంతో నష్టాలు పెరుగుతున్నాయని ఎల్‌ అండ్‌ టీ అధికారులు చెబుతున్నారు. రుణాల వడ్డీల చెల్లింపుల నిమిత్తం తక్షణ సాయంగా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్లు అందిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అయితే ఇంతవరకు తమకు ఎలాంటి సాయం అందలేదని మెట్రో వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

మరోవైపు మెట్రో నిర్మాణం రెండేళ్లు ఆలస్యం కావడంతో నిర్మాణ వ్యయం కూడా రూ.3 వేల కోట్ల మేర పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ సర్కారు సాయం కోసం అర్జించింది. ఈ విషయంలో ఎలాంటి ముందడుగు పడడంలేదు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం (31 కిలో మీట ర్ల) రూట్‌లో మెట్రో ప్రక్రియ కూడా ఆలస్యమవుతోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సైతం ఢిల్లి మెట్రో రైలు కార్పొరేషన్‌ రూపొందించింది. దీనికికూడా బడ్జెట్‌ సమస్యగా మారింది. ఇచ్చిన హామీ మేరకు ప్రభు త్వం కొంత మేర అదుకుంటే ఆర్థిక భారం నుంచి కొంత గట్టె క్కవచ్చని, వడ్డీల రూపంలో చెల్లిం చాల్సిన మొత్తం కూడా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -


Advertisement

తాజా వార్తలు

Advertisement