మనిషి జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగడానికి మానసిక ధృఢత్వం చాలా కీలకమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. లూయిస్ బ్రెయిల్ 213వ జయంతి పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వేడుకలలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధుల విద్యాబ్యాసం కోసం సులువుగా ఉండే విధంగా లిపిని నిర్మించి, వారి జీవితాలలో వెలుగును నింపిన నిరంతర పరిశోధకుడు లూయిస్ బ్రెయిల్ , ఆయన 1809వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ జన్మించాడని, ఆయన 6 చుక్కలతో 1831వ సంవత్సంలో కొత్త లిపి రుపొందించాడని, చుక్కల ద్వారా అక్షరమాలలోని ప్రతి అక్షరాన్ని, ఉచ్చారణను అనుసరించి గుర్తులను, లెక్కలకు సంబంధించి సాంకతిక పదాలను, సంగీతానికి సంబంధించిన గుర్తులను తేలికగా రాసే విధంగా లిపి సిద్దం చేసాడని తెలిపారు.
అంధుల లిపి కోసం లూయిస్ బ్రెయిల్ చేసిన కృషి చిరస్మరణీయమని అదనపు కలెక్టర్ అన్నారు. మనం మానసికంగా ధైర్యంగా ఉంటూ జీవితంలో లక్ష్యం ఎర్పాటు చేసుకొని వాటి సాధన దిశగా కృషి చేయాలని, ఇతరులకు సైతం దివ్యాంగులు మార్గనిర్దేశం చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తుందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం , జిల్లాలోని దివ్యాంగులను ఆయన సత్కరించారు. జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, కలెక్టరేట్ సూపరెండేం ఉన్ట్ తూము రవీందర్ సంబంధిత అధికారులు, దివ్యాంగులు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.