Monday, November 18, 2024

Memorable – కోటీ దీపోత్సవంలో పాల్గొనడం గొప్ప అదృష్టం ప్రధానమంత్రి మోడీ. . .

హైద్రాబాద్ లో ఓ ప్రైవేట్ టీవీ చానెల్ నిర్వహించిన కోటీ దీపోత్సవం కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రకృతి సహకరించకున్న టన్నెల్ లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మోడీ చెప్పారు. టన్నెల్ లో చిక్కుకున్నవారు బయటకు రావాలని దీపం వెలిగించాలని మోడీ కోరారు

కార్తీక పౌర్ణమి రోజున కోటిదిపోత్సవంలో పాల్గొనడం తన అదృష్టంగా మోడీ పేర్కొన్నారు. ఆ దేవుడి దీవెనలతో తాను ఇవాళ ఇక్కడ ఉన్నానని ఆయన చెప్పారు. ఇవాళ కాశీలో దీపోత్సవం జరుగుతుందన్నారు. తాను ఇక్కడ దీపోత్సవంలో పాల్గొన్నానని మోడీ పేర్కొన్నారు. కార్తీక పౌర్ణమి రోజున తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడ దర్శించుకున్నట్టుగా మోడీ పేర్కొన్నారు.తిరుమల శ్రీనివాసుడి దర్శనభాగ్యం చెప్పలేనిదన్నారు. ఇవాళ గురుద్వార్ ను కూడ దర్శించుకొనే భాగ్యం తనకు దక్కిందన్నారు..

తాను ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. కానీ ఈ కార్యక్రమం తనకు ప్రత్యేకమైందన్నారు. కోటి దిపోత్సవం నిర్వహిస్తున్న టీవీ చానెల్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. శ్రీశైలం నుండి వేములవాడ వరకు భద్రాద్రి నుండి ఆలంపూర్ వరకు ఆధ్యాత్మిక త వెల్లివిరుస్తుందని మోడీ చెప్పారు.దీపజ్యోతి మనకు వెలుగునిస్తుంది.. చీకట్లను తొలగిస్తున్నాయన్నారు. ఈ దీపాలు ఆత్మనిర్భర్ భారత్ ను సూచిస్తాయని మోడీ పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement