ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్:న్యూఇయర్ వస్తుందంటే చాలామంది కొత్తకొత్తగా శుభాకాంక్షలు చెబుతుంటారు. అందులో చిత్రకారులు తాము రూపొందించిన ఫొటోలను షేర్ చేస్తే… మరికొందరు స్వీయ కవితా రచనలను.. ఇంకొందరు ఫోటోగ్రఫీతో వారి వారి ఇష్టా ఇష్టాలను తెలియజేస్తుంటారు. అయితే.. బీఆర్ఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, గ్రీన్ చాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కాస్త డిఫరెంట్ అనే చెప్పుకోవాలి.
ఆయన వృక్ష ప్రేమికుడే కాదండోయ్.. పక్షి ప్రేమికుడు కూడా అనే విషయాన్ని తెలిసేలా కొత్త వీడియో రూపొందించాడు. ఇది కాస్త డిఫరెంట్ గురూ..జోగినపల్లి సంతోష్‌కుమార్‌కు ఫొటోగ్రపీ అన్నా, పక్షులు అన్నా ఎంతో ఇష్టం! తన అభిరుచిని తెలియజేస్తూ సోషల్ మీడియా ఎక్స్‌లో ఓ వీడియోను ఆదివారం పోస్టు చేశారు.
తాను పక్షి ప్రపంచాన్ని చూసిన తీరు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక.. ప్రపంచంలో సుమారు 20 వేల జాతుల పక్షులుంటాయి. వాటిన్నింటిని సామాన్యులు చూడడం చాలా కష్టం.. కానీ, పక్షి ప్రేమికుడైన సంతోష్ తన ఫొటోగ్రపీలో బంధించిన పలు రకాల పక్షుల చిత్రాలు, వీడియోలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.