Thursday, December 19, 2024

NZB | ఎల్లారెడ్డి ఎంఈఓ వెంకటేశంకు మెమో జారీ…!

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనంలో నిర్లక్ష్యం…!
సమయపాలన పాటించని ఉపాధ్యాయులు….! ఆర్డీఓ మన్నె ప్రభాకర్


ఎల్లారెడ్డి, డిసెంబర్ 19 (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్న ఏ.వెంకటేశంకు ఆర్డీవో మన్నే ప్రభాకర్ మెమో జారీ చేశారు. మండలానికి ఇన్చార్జి ఎంఈఓగా పనిచేస్తున్నప్పటికీ ఆయన ప్రధానోపాధ్యాయులుగా ఉన్న పాఠశాలలోనే విద్యార్థినీలకు మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, సమయపాలన పాటించకపోవడంపై ఎల్లారెడ్డి ఆర్డీఓ మన్నె ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి బుధవారం మెనూ ప్రకారం విద్యార్థినులకు గుడ్డు పెట్టకపోవడంతో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులను ఆర్డీవో ప్రశ్నించగా.. బిల్లులు సమయానికి రావడం లేదని సమాధానం చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఏ.వెంకటేశం అందుబాటులో లేకపోవడంతో ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాలలో రికార్డులను పరిశీలించగా రిజిస్టర్లలో ముగ్గురు ఉపాధ్యాయులు ఎలాంటి లీవ్ లెటర్ లేకుండానే సిఎల్ రాశారని, ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యం, సమయపాలన పాటించకపోవడం వలన విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడం లేదని మండిపడ్డారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశాలు ఇచ్చినా కొంతమంది నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మండల విద్యాధికారిగా, పాఠశాల ప్రధానో పాధ్యాయులుగా ఉన్న ఏ.వెంకటేశంకు మెమో జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement