Sunday, November 24, 2024

Membership Drive – బిజెపి సభ్యత్వ నమోదులో కరీంనగర్ టాప్ – బండి

కరీంనగర్, ఆంధ్రప్రభభారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి బండి సంజయ్ కుమార్ తెలియజేశారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణారెడ్డి చేతుల మీదుగా కేంద్రమంత్రి బండి సభ్యత్వం తీసుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల 67 వేల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని లక్ష్యం విధించగా, నేటి వరకు 30 లక్షల సభ్యత్వం నమోదు పూర్తయిందన్నారు. అనుకున్న లక్ష్యంలో 75 శాతానికి చేరుకున్నామని 100% లక్ష్యంగా ముందుకు సాగుతున్నమన్నారు. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిందని, ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేయడం విశేషమన్నారు.

సభ్యత్వ నమోదులో భూపాలపల్లి, ములుగు జిల్లాలు అట్టడుగున ఉన్నాయన్నారు.ఆయా జిల్లాల్లో 20 వేలలోపే సభ్యత్వం నమోదైందని సభ్యత్వ నమోదును వేగవంతం చేసేలా నాయకులు కృషి చేయాలన్నారు.అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 61 వేల మంది సభ్యులను చేర్పించాలని లక్ష్యం విధించగా, 70 వేలకుపైగా సభ్యులను నమోదు చేశారన్నారు. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా పరిశీలిస్తే ఇచ్చిన టార్గెట్ ను అధిగమించిన పార్లమెంట్ నియోజకవర్గాల్లో కరీంనగర్ అగ్రభాగాన నిలిచిందన్నారు.

- Advertisement -

ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేశామన్నారు. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వాన్ని నమోదు చేయడం అభినందనీయమన్నారు. సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిన సందర్భంగా కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement