మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ విభాగం మేఘా గ్యాస్ సూర్యాపేటలో తొలి సీఎన్‌జీ స్టేషన్‌ను శుక్రవారం ప్రారంభించింది. సూర్యాపేట మునిసిపల‌్ కమీషనర్ రామాంజనేయులు ఈ కాలుష్య రహిత సీఎన్‌జీ స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ సేల్స్ ఆఫీసర్ శ్రీ మోహన్‌కృష్ణ, మేఘా గ్యాస్ నల్లగొండ, ఇన్ ఛార్జి కే. తరుణ్ సాయి, ఖమ్మం జిల్లా ఇన్ ఛార్జి వంశీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తరుణ్ సాయి మాట్లాడుతూ.. “ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరికొన్ని సీఎన్‌జీ స్టేషన్లను ప్రారంభించనున్నాం. సూర్యాపేట సీఎన్‌జీ స్టేషన్‌కు వలిగొండలోని మదర్‌స్టేషన్‌ను సీఎన్‌జీని సరఫరా జరుగుతుంది. గృహ అవసరాలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ)ను సరఫరాను ఇప్పటికే వలిగొండలో ప్రారంభించాం. త్వరలో నల్లగొండ పట్టణం, బీబినగర్‌లలో కూడా పీఎన్‌జీ పంపిణీ చేయనున్నాం” అని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరో పన్నెండు సీఎన్‌జీ స్టేషన్లను మేఘా గ్యాస్ వచ్చే ఏడాది లోగా ప్రారంభించనున్నది. జాతీయ రహదారిలోని చౌటుప్పల్, చిట్యాల, కట్టంగూర్‌లో పాటు నల్లగొండ, భువనగిది, రాయగిరి, మిర్యాలగూడ, కొండమడుగు, మేల్వచెరువులలో ఈ సీఎన్‌జీ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నది.