ఇటీవల మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడంది.. దీనిలో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 29న సీఎం రేవంత్ స్వయంగా మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
కాగా, గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త అభ్యర్థులు మాత్రం నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఒక్కో దరఖాస్తుకు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థి వయసు 1.7.2023 నాటికి 18 నుంచి 46 ఏళ్ల మధ్య ఉండాలి. ఎక్స్ సర్వీ్‌సమెన్‌కు 3 ఏళ్లు; ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వెసులుబాటు ఉంది.
ఖాళీ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 2,629, భాషా పండితులు 727, ఫిజికల్ ఎడ్యుకేషన్ 182, ఎస్జీటీలు 6,508, ఎస్ఏ (స్పెషల్ ఎడ్యుకేషన్) 220, ఎస్జీటీ (స్పెషల్ ఎడ్యుకేషన్) 796 పోస్టులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే యూనిట్‌గా సీబీఆర్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేటప్పుడే పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పరీక్షల తేదీలను త్వరలో ప్రటించనున్నారు.
పరీక్ష కేంద్రాలు….
తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు. 1) మహబూబ్‌నగర్, 2) రంగారెడ్డి, 3) హైదరాబాద్, 4) మెదక్, 5) నిజామాబాద్, 6) ఆదిలాబాద్, 7) కరీంనగర్, 8) వరంగల్, 9) ఖమ్మం, 10) నల్గొండ మరియు 11) సంగారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.