Tuesday, November 19, 2024

Meeting with Farmers – ఉచిత విద్యుత్ కోసం కేసీఆర్ ఎనలేని కృషి – మంత్రి ప్రశాంత్ రెడ్డి…

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ రైతు వేదిక వద్ద రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆశ మాషగా రాలేదని తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్న బాధలతో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో ఎన్నోమార్లు అన్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడం ఎంతో మంది రైతులు తమ ప్రాణాలను సైతం విడిచారని ఆనాటి రోజులు పాలకులు అలా గడిపారని నేటి కేసిఆర్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ రైతులకు పంపుసెట్లకు సరిపడా విద్యుత్ను అందించడంతోపాటు తెలంగాణలో కాలేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల బాగానే సాగు భూములకు సాగునీరు అందించిన ఘనత కేసిఆర్ కే దక్కిందన్నారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు రైతులు ఆలోచన చేయాలి.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వ్యవసాయ విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను రైతన్నలు తేలికగా దయగా ఆలోచన చేయవద్దని వారు చేసిన వ్యాఖ్యలు ఊరికే చేయలేదని కాంగ్రెస్ పార్టీ వారి మనసులో రైతులపై ఉన్న అభిప్రాయాన్ని రేవంత్ వ్యక్తం చేశారని తెలంగాణ రైతాంగం రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఆలోచన చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులను ఆలోచింప చేశారు. భారతదేశంలో వ్యవసాయ పంప్ సెట్ లకు ఉచిత విద్యుత్తు 24 గంటల పగటి విద్యుత్ను అందించడం తెలంగాణ రాష్ట్రానికి సాధ్యమైంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుబంధు పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆ రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా ఎందుకు చేయడం లేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మిగులు విద్యుత్ను మనలాంటి రాష్ట్రాలకు విద్యుత్తును అమ్ముకుంటున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చిన సందర్భంలో రాజకీయ పార్టీలన్నీ ప్రజల వద్దకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ప్రజలు వారి మోసాలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడి ధనార్చన చేశారని కష్టపడకుండా వచ్చిన డబ్బుతో తెలంగాణ రాష్ట్రానికే ముఖ్యమంత్రి కావాలని దురాలోచన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.

కెసిఆర్ తో తాను ఎంతో సన్నిహితంగా ఉంటానని ప్రతిసారి రైతుల బాగోగుల గురించి ఆయన నాతో చర్చిస్తూ ఉంటారని మంత్రి ప్రశాంత్ రెడ్డి రైతులకు వివరించారు. ఆర్మూర్ , బాల్కొండ రైతుల సాగునీటి కష్టాలను తీర్చేందుకే కాలేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని శ్రీరాంసాగర్ కు తరలించ్చే ఏర్పాట్లు చేశామన్నారు. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు వరుణ దేవుడు కరుణించకపోవడంతో రైతుల కొంతవరకు ఆందోళన గురయ్యారని వారి కష్టాలను తీర్చేందుకే కాలేశ్వరం నీటిని శ్రీరాంసాగర్ కు చేర్చి రైతుల కళ్ళల్లో వెలుగులు నింపామని రైతన్నలు పడిన ఆనందాన్ని తాను ప్రతినిత్యం పాలుపంచుకుని అనుభూతుని పొందానని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తం చేశారు.

రాబోయే ఎన్నికల్లో పబ్బం గడుపుకునేందుకే రాజకీయ పార్టీ నాయకులు ప్రజల్లో అశాంతిని కల్పించే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని త్వరలోనే ప్రజల తిరగబడే రోజులు వస్తాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ఎన్ని ఎత్తుగడలు వేసినా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో ముందుంచిన మరియు సంక్షేమ పథకాలు అమలులో ప్రపంచంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రతిష్టలు సంపాదించారని కొని ఆడారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీకి చెందిన వారే వందమందికి పైగా ఎమ్మెల్యేలు గెలుపు పొందాలని తిరిగి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పట్టం కట్టేందుకు ప్రజల సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement