తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగ్గజ కంపెనీ బృందం సమావేశమైంది. మంగళవారం సచివాలయంలో నోకియా జర్మనీ ప్రతినిధులు రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణలో కంపెనీ పెట్టుబడుల నేపథ్యంలో సీఎంను నోకియా జర్మనీ బృందం కలిసినట్లు సమాచారం.
ఈ సమావేశంలో నోకియా గ్లోబల్ హెడ్ మార్టీన్, సేల్స్ హెడ్ మ్యాన్క్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్, రాజేష్, సీస్ రావ్, పద్మజ, ఎమ్మెల్యే మదన్ మోహన్ పాల్గొన్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. కొత్త పాలసీలు తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. ఐటీ రంగంలో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.
దీనివల్ల ఉద్యోగాలతో పాటు.. పరోక్షంగా ఎన్నో అవకాశాలు లభిస్తాయని వివరించారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు వృద్ధి చెందడంలో కంపెనీల ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ల (సీఎఫ్‌ఓ) పాత్ర కీలకంగా ఉందని రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. రాష్ట్రాలు అందించే ఇన్సెంటివ్‌లను పరిశీలించే బాధ్యత వారిదేనని గుర్తు చేశారు. చాలా వరకు అన్ని రాష్ట్రాలు ఇన్సెంటివ్‌లను, ఆర్థిక ప్యాకేజిలను అందిస్తున్నాయని వివరించారు.