Friday, November 22, 2024

Meet the Press – కెసిఆర్ కాళ్ల కింద పీఠం క‌దులుతున్నా గ‌మ‌నించడం లేదు – ఈట‌ల

హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను ఎందుకు పోటీ చేస్తానని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే బీసీ బంధు దక్కిందన్నారు. కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులతో పాటు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. అసైన్డ్, ప్రభుత్వ భూములను అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందన్నారు.

మరోపక్క, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. బీఆర్ఎస్‌ను గద్దె దించడమే బీజేపీ లక్ష్యమన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేసి అధికారంలోకి తీసుకు రావాలన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే వారు బీఆర్ఎస్‌లో చేరారన్నారు.

కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటారన్నారు. వాస్తవాలు, నిజాలను తెలుసుకోవటానికి కేసీఆర్ ఇష్టపడరని కీలక వ్యాఖ్యలు చేశారు. కాళ్ళ కింద భూమి కదులుతోన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించటం లేదన్నారు. వాస్తవాలు చెప్తే కేసీఆర్ దబాయింపుతో వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్ళు, నియామకాల విషయంలో కేసీఆర్ సంపూర్ణంగా విఫలమైందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి మాదిరి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందన్నారు. ఒక్క గజ్వేల్ లోనే 30వేల మంది కేసీఆర్ బాధితులున్నారని తెలిపారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీబంధు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హంగ్ వస్తే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. గతంలో కలసి పనిచేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటైతే నేను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తాను? అని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ గతంలో ఎప్పుడూ కలసి పోటీ చేయలేదన్నారు. బీజేపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement