Tuesday, November 26, 2024

Meet the Press – కమలం వికసిస్తేనే అభివృద్ధి – బీజేపీ అభ్యర్థి ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభన్యూస్)21: నిజాంబాద్ అర్బన్ లో కమలం వికసిస్తేనే అభివృద్ధి జరుగు తుందని… ఒక్కసారి బిజెపి పార్టీకి అవకాశం ఇవ్వా లని బిజెపి అర్బన్ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. బిఆర్ఎస్ 9 సంవ త్సరాల పాలనలో నిజామా బాద్ అర్బన్ లో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ అభివృద్ధి పనుల పేరిట.. జేబులు నింపుకున్నారే తప్ప అభివృద్ధి జరగలేదని ధ్వజమె త్తా రు. మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన మీట్ ది ప్రెస్ లో ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని మాట్లాడారు

.

ప్రజా సేవలో తరిస్తోన్న తాను ప్రజలకు మరింత సేవ చేసేందుకే రాజకీ యాల్లోకి వచ్చానని తనపై ఒక్క అవినీతి ఆరోపణలు లేవని అన్నా రు…2014 లో ఓడిపోయినా బీజేపీ లోనే ఉన్నానని పార్టీ పటిష్టత కోసం పనిచేశానని చెప్పారు. అర్బన్ ఎమ్మెల్యే గా గెలిపిస్తే నగరంలో జరిగిన అవినీతి అక్రమాలకు బయట పెడతానని.. కబ్జా భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తా నని అన్నారు.కమిషన్లు లేని అభివృద్ధి పనులు చేపడతానని కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెస్తానని చెప్పారు.

ఈ కార్యక్ర మంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంతడుపుల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి బైర శేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మండే మోహన్, కోశాధికారి కోరన సందీప్, ఉపాధ్యక్షులు ఆంజనేయులు, గోవిం దరాజులు ఇంగు శ్రీనివాస్ గుప్తా, కార్యవర్గ సభ్యులు సీనియర్ జర్నలిస్టులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement