Friday, November 22, 2024

Medical Camp – ఆ మూడు సూత్రాలు పాటించండి – ఆరోగ్యం గా ఉండండి – వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌: పౌష్టికాహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దురలవాట్లకు దూరంగా ఉండటం.. ఈ మూడు సూత్రాలను తప్పనిసరిగా పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బోరబండలోని నాట్కో ప్రభుత్వ పాఠశాలలో స్వర్ణ భారత్ ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్, ఏఐజీ ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని నేడు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ ఆస్పత్రి వైద్యులే పేదల వద్దకు వెళ్లి వైద్య పరీక్షలు చేసి, తగిన సూచనలు ఇవ్వాలన్న మంచి ఆలోచనతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. . వీటిపై వైద్యులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement