Friday, November 22, 2024

బోదకాల వ్యాధిగ్రస్తులకు అవ‌గాహ‌న స‌ద‌స్సు…

జన్నారం, జూన్28(ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని బోదకాల వ్యాధిగ్రస్తులకు డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ ఓ కోఆర్డినేటర్ శిరీష మాట్లాడుతూ, బోదకాల( ఫైలేరియా) వ్యాధి వచ్చే శరీర భాగాలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత , దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. వ్యాధిగ్రస్తులకు ఎం. ఎం. డి .పి. టి కిట్టు ఎలా వాడుకోవాలో , వ్యాయామం ఎలా చేయాలో ఆమె వివరించారు.

ఈ కార్యక్రమంలో డబ్ల్యూహెచ్ఓ కోఆర్డినేటర్లు కమలాకర్, రాజం స, జన్నారం ప్రభుత్వ వైద్యాధికారి ఉమా శ్రీ, సి. హెచ్ .ఓ రమేష్, అల్లాడి శ్రీనివాస్ ,హెల్త్ ఎడ్యుకేటర్ గుండేటి నాందేవ్ ,సబ్ యూనిట్ ఆఫీసర్, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ,బోదకాలు వ్యాధిగ్రస్తులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement