Sunday, November 24, 2024

Medchal …. జ్యువెలరీ షాప్ దోపిడీ దొంగ‌లు దొరికారు….

మేడ్చల్‌లో జ్యువెలరీ షాప్ దోపిడీ కేసును మేడ్చల్‌ పోలీసులు 24 గంటల్లో ఛేదించి నిందితులను పట్టుకున్నారు. జగదాంబ జ్యువెలరీ షాప్‌లో మాస్క్, బుర్ఖా ధరించి యజమానిని కత్తితో పొడిచి డబ్బు ఎత్తుకెళ్లారు దుండగులు. సిసి కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సైబరాబాద్ సీపీ అవినాష్ మహతి మీడియా మాట్లాడుతూ.. జ్యువెలరీ షాప్ లో దొంగతనం చేయడానికి విఫల యత్నం చేశారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసామ‌ని, మరొకరు పరార్ అయ్యారని తెలిపారు.

మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు నిందితులు జువెలరీ షాప్ లోకి చొరబడ్డారు. ఆ క్రమంలో షాప్ ఓనర్స్ ను చంపడానికి కూడా వెనకాడ లేదన్నారు. రాబరికి పాల్పడుతున్న సమయంలో షాప్ ఓనర్ కేకలు పెట్టారని, వారి మీద దాడి చేసి నిందితులు పరారయ్యారు.. ఈ కేసులో ముగ్గురి భాగస్వామ్యం ఉందని , ఈ కేసులో నిందితులు హైదరాబాద్‌కు సంబంధించిన వారేనని ఆయన తెలిపారు.

- Advertisement -

ఈ కేసులో ప్రధాన నిందితులు నజీమ్ అజీజ్ కొటాడియా.. షేక్ సోహెల్.. అని, నిందితులు రాబరికోసం చోరీ చేసిన బైక్‌ను వినియోగించారని చెప్పారు. నిందితులు బైక్ను ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలో చోరీ చేశారని, చోరీ చేయడానికి ముందు నిందితులు మూడుసార్లు రెక్కీ నిర్వహించారన్నారు. సుమారు పదిచోట్ల రెక్కీ నిర్వహించి మేడ్చల్లో దోపిడీకి యత్నించారని, నిందితులను పట్టుకోవడం కోసం సుమా 200 సిసి కెమెరాలు జల్లెడ పట్టామని పేర్కొన్నారు. బైక్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినప్పుడు చోరీ చేసిన బైక్ గా గుర్తించామని, ఇటీవల చాధర్ ఘాట్ లో జరిగిన చోరీ నిందితుడు కోటడియా పాత్ర ఉందన్నారు. ముందుగా కోటాడియా అరెస్ట్ చేసామ‌ని, అతని ద్వారా షేక్ సోహెల్ అరెస్ట్ చేసామని, ఇద్దరికీ జైలులో పరిచయం ఏర్పడిందన్నారు. ఇద్దరు నిందితులకి సహకరించిన మరొక వ్యక్తి పరారీలో ఉన్నాడని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement