మేడ్చల్ జులై 21(ప్రభన్యూస్):భారీ వర్షాలు కురవడంతో మేడ్చల్ పెద్ద చెరువు అలుగు ఉరకలేస్తుంది.శుక్రవారం భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పరుగులెత్తడంతో మేడ్చల్ పెద్ద చెరువుకి వరద ప్రవాహం జోరందుకుంది.ఈ నేపథ్యంలో మేడ్చల్ పెద్ద చెరువు అలుగు వద్దకు మున్సిపల్ పట్టణ ప్రజలు చేరుకొని గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.వర్షాకాలం సాగు కోసం ఎదురుచూస్తున్న రైతన్నల మొహాల్లో సంతోషం వ్యక్తం అవుతుంది.
మొన్నటి వరకు వర్షాలు కురవక రైతుల మొహాల్లో ఆందోళన కనిపించేది ఇప్పుడు భారీ వర్షాల కారణంగా అందరి మొహాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. వరుడు కరుణించడంతో చెరువులు కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి.గత ఏడాది కూడా ఇదే సమయంలో భారీ వర్షాలు కురిసి మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పెద్ద ఎత్తున వరదలతో ప్రవహించింది..