Thursday, November 7, 2024

Medchal – ప్రాణ‌పోయినా… పది మందికి జీవ‌న‌దానం

బ్ర‌యిన్ డెడ్ లో దీపిక‌
ఆమె కుటుంబం అపురూప త్యాగం
కుమార్తె అవ‌య‌వ‌దానం
ప‌ది మందికి కొత్త జీవితం
మేడ్చ‌ల్ లో ఘ‌ట‌న

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – ఈ జీవకోటిలో మనిషి పుట్టుక ఒక అద్భుతం. అన్ని జీవులలో అత్యంత తెలివైనవాడు మనిషి. ప్రతి ఒక్కరూ ఈ జన్మలో ఏదైనా గొప్పగా చేసి పదిమందికి గుర్తుండిపోయేలా చేయాలని కోరుకుంటారు. వ్యక్తి చనిపోయిన తర్వాత 200 అవయవాలను దానం చేసి పది మంది ప్రాణాలు కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉజ్వల భవిష్యత్తు ఉన్న తమ కూతురు బ్రెయిన్ డెడ్‌తో హఠాత్తుగా మరణించడంతో తల్లిదండ్రులు ఆమె అవయవాలను దానం చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది.

- Advertisement -

మేడ్చల్ పట్టణానికి చెందిన కూర శ్రీనివాస్, సరిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నాడు. రెండో కూతురు కూర దీపిక(16) నగరంలోని ఓ కళాశా లలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల22న ఇంటి నుంచి బయలుదేరే సమ యంలో వాంతులతో ఫిట్స్ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. నగరంలోని యశోద ఆసుపత్రిలో చేర్చించారు. బాలికను పరీక్షించిన వైద్యులు అవయవాలు స్పందించడం లేదని వెంటిలేటర్ పై వైద్యం అందించారు. బ్రెయిన్ డెడ్ అయ్యిందని వైద్యులు తేల్చారు. ఆ తల్లి దండ్రులకు వచ్చిన ఆలోచనతో ఆసుపత్రి వర్గాలతో సంప్రదించి బాలిక అవయ వాలు దానం చేసేందుకు నిర్ణయించారు. దీంతో ఆ బాలిక అవయవాలతో పది మందికి ప్రాణం పోశారు. దీంతో ఆమె త‌ల్లిదండ్రుల ఔదార్యానికి వైద్య‌లు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement