ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని తెలంగాణ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, బండా ప్రకాశ్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. నిన్న ఢిల్లీ వెళ్లిన వీరంతా మంత్రిని కలిసి విన్నవించారు.ములుగు జిల్లా పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తించేందుకు చొరవ చూపాలని కోరారు. ఈ సందర్భంగా చారిత్రక సంపదను చాటే రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని అందజేసింది. అలాగే, రెండేళ్ల కోసారి జరిగే మేడారం జాతరకు ప్రభుత్వం రూ. 200 కోట్లు వెచ్చిస్తోందని, కేంద్రం నుంచి కూడా కొన్ని నిధులు ఇవ్వాలని మంత్రిని కోరారు.
మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తించాలంటూ కేంద్రానికి వినతి
- Tags
- breaking news telugu
- latest breaking news
- latest news telugu
- MEDARAM JATARA
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- TS News Today Telugu
- viral news telugu
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement