Tuesday, November 19, 2024

Medaram Jathara – ఫిబ్రవరి 21వ తేదీ నుంచి గిరిజన కుంభమేళా ప్రారంభం – మంత్రి సీతక్క

ములుగు: వచ్చే ఏడాది ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మేడారం జాతర ప్రారంభమవుతుందని మంత్రి సీతక్క ప్రకటించారు. ఆదివారం నాడు సీతక్క మేడారంలో పర్యటించారు. ఈ పర్యటనలో మేడారంలో త్వరలో నిర్వహించబోయే జాతరపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీతక్క మీడియాతో మాట్లాడుతూ….”జాతర నిర్వహణకు 75కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వెంటనే నిధుల విడుదల చేశారు.

75కోట్లేనా అని కొంతమంది అడగొచ్చు… కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.జాతర సజావుగా జరిగేందుకు ప్రణాళిక చేశాం. పనులు శాశ్వత ప్రాతిపదికన చేస్తాం. శానిటేషన్, ట్రాఫిక్, ఆర్టీసీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలపై దృష్టి సారించాం.కేంద్రం జాతీయ హోదా ఇవ్వడంతో నిధుల కోసం ప్రతిపాదనలు పంపాం. కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుందని ఆశిస్తున్నాం” అని మంత్రి సీతక్క తెలిపారు.

ములుగు గడ్డపై మంత్రిగా సీతక్క తొలి అడుగు :

నూతనంగా కొలువుదీరిన ప్రభుత్వంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్ర పంచాయతీ రాజ్,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా ములుగు నియోజక వర్గానికి వస్తున్న మంత్రి సీతక్క కు ములుగు మండలం లోని గౌస్ పల్లి దగ్గర స్వాగతం పలికెందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో మొదటి సారిగా ములుగు గడ్డపై ఎమ్మెల్యే గా వెళ్లి తిరిగి మంత్రిగా సీతక్క అడుగు పెట్టడంతో నాయకులు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు..ముందుగా ములుగు జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జై కాంగ్రెస్ జై సీతక్క అంటు నినాదాలు చేశారు.

- Advertisement -

ఈ క్రమంలో ఆడపడుచులు,కోలాట బృందాలు,డప్పు వాయిద్యాల నడుమ మంత్రి సీతక్క కు స్వాగతం పలికారు.కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మేకల ప్రశాంత్ భారీ గజమాలతో మంత్రి సీతక్క ను సత్కరించారు. అనంతరం సీతక్క ప్రజలకు,నాయకులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement