తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఈ నెల 24 వరకు జాతర జరగనుంది. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6వేల ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. అయితే హైదరాబాదులో ఆర్టీసీ బస్సుల కోసం ప్రయాణికుల పడికాపులు కాస్తున్నారు.
సిటీ బస్సులను సైతం ఆర్టీసీ అధికారులు మేడారం జాతరకు నడుపుతున్నారు. మెయిన్ రూట్లలో అరకొర బస్సులను తిప్పుతున్నారు. ఈ విషయం తెలియక ప్రయాణీకులు గంటల తరబడి బస్టాప్ లలో వేచి చూస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకున్న ఉబర్, రాపిడో 20శాతం చార్జీలు పెంచాయి. డ్యూటీలకు వెళ్లేవారు తప్పని పరిస్థితిలో చార్జీలు ఎక్కువైనా వెళ్లక తప్పడం లేదు.