Monday, November 11, 2024

Medaram – వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ….

మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. ఇవాళ మేడార జాతరకు వెళ్లిన గవర్నర్ సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు స్వర్ణం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గ‌వ‌ర్న‌ర్ తో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా కూడా సమ్మక్క-సారలమ్మ దేవతలను దర్శించుకున్నారు.

భారతదేశంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ముఖ్యంగా గిరిజనులు ఐక్యంగా ఉండి సంతోషంగా ఉండాలని వన దేవతలను మొక్కుకున్నట్లు గవర్నర్ తన మనసులో మాటను బయటపెట్టారు. గవర్నర్ హోదాలో ఇప్పటి వరకు మేడారం మూడు సార్లు సందర్శించి అమ్మవార్లను దర్శించి మొక్కులు అప్పచెప్పడం అదృష్టంగా భావిస్తున్నట్లు తమిళసై అన్నారు. గిరిజనులను అభివృద్ది చేయాలనే తనకున్న బలమైన కోరికతో ఇక్కడి 6 గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు.

దేశంలోనే అతి పెద్ద ఆదివాసీ జనజాతర మేడారం: కేంద్ర మంత్రి అర్జున్ ముండా

దేవంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారమని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు. మేడారంలో వన దేవతలను దర్శించుకుని మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులు తెలంగాణతో పాటు చత్తీస్ గఢ్ రాష్ట్రంలో గిరిజనులు ఎక్కువగా ఉంటారని రెండు రాష్ట్రాల ఆదివాసులకు మేడారం వరమని ఆయన అన్నారు. మేడారాన్ని ట్రైబల్ ఫెస్టివల్ జాతరగా జరిపేందుకు ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అంత‌కు ముందు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్నారు. వీరికి మంత్రి సీతక్క, ఈటెల రాజేందర్, జిల్లా కలెక్టర్, త్రిపాఠి ఘనస్వాగతం పలికారు. అనంతరం వనదేవతల దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ అక్కడ బంగారాన్ని సమర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement