Tuesday, November 26, 2024

TS: 25 ఏళ్ల‌లో మెద‌క్ అభివృద్ది సున్నా.. సీఎం రేవంత్

ఈ ఘ‌న‌త బీజేపీ, బీఆర్ఎస్ దే
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ కు ప‌ట్టం క‌ట్టండి
బీజేపీ ది విభ‌జించు, పాలించు సిద్దాంతం
ముస్లీంలు, హిందువులు త‌న్నుకునేలా క‌మ‌లం వ్యూహం
అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించిన రేవంత్
చివ‌రి రోజును ప‌టాన్ చెరులో ముఖ్య‌మంత్రి రోడ్ షో

25 ఏళ్లుగా మెదక్ స్థానాంలో బీఆర్ఎస్ లేదా బీజేపీ ఎంపీలే ఉన్నార‌ని, కానీ ఈ రెండు పార్టీలు ఈ ప్రాంతానికి అన్యాయం చేశాయని ధ్వజమెత్తారు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్ చెరులో నిర్వహించిన కార్నర్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… పటాన్ చెరు మినీ ఇండియా లాంటిదని దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ప్రశాంతంగా నివసిస్తున్నార‌న్నారు.. ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు సక్రమంగా లేవని ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మెట్రో రైలు రావాలన్నా, మాదిగల వర్గీకరణ కేసు గెలవాలన్నా, ముదిరాజులను బీసీ-డీ గ్రూప్ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి మారాలన్నా ఇక్కడ నీలం మధు గెలిపించాలని కోరారు.

విభ‌జించు…పాలించు.. ఇదే బీజేపీ విధానం…
మతాలు, భాషలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మనుషులు కత్తులతో పొడుచుకునేలా బీజేపీ కుట్రలు చేస్తోందని, హిందూ ముస్లింలు పొడుచుకుని రక్తం పారుతుంటే అందులో నుంచి ఆ పార్టీ సీట్లు గెలుచుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గతంలో అభివృద్ధి, సంక్షేమం ప్రాతిపదికను ఎన్నికలు జరిగేవని, కానీ తొలిసారి ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చుతాం, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్నార‌ని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

- Advertisement -

రోజు కొట్టుకుంటే పెట్టుబ‌డులు ఎలా వ‌స్తాయి..
శాంతిభద్రతలు ఉంటేనే పెట్టుబడలు వస్తాయ‌ని, యువకులకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరుగుతుంద‌న్నారు రేవంత్. అలాకాకుండా రోజూ కొట్లాడుకుని చస్తుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు.

ఈ రాష్ట్రానికి నిన్నా మొన్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా వచ్చార‌ని, కేంద్రంలో పెద్దలుగా ఉన్న వారు రాష్ట్రానికి వస్తే ఏదైనా తెస్తారేమో అనుకున్నామ‌ని, అలా ఏమీ జ‌ర‌గ‌లేద‌న్నారు. ఈ ప్రాంతానికి మెట్రో రైలుతో పాటు పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వ‌క‌పోగా ఇక్కడి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చుతార‌ని. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారన్నారు.

ప్రస్తుతం తెలంగాణలో పేదల ప్రభుత్వం నడుస్తోంద‌ని, తాను కేవలం రబ్బరు స్టాంపును మాత్రమేన‌ని రేవంత్ చెప్పుకున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంతా జగ్గారెడ్డిదే పెత్తనమ‌ని న‌వ్వుతూ అన్నారు. ఈ ప్రాంతానికి కాంగ్రెస్ ఎన్నో సంస్థలను తీసుకువచ్చింద‌ని,. అందుకే కాంగ్రెస్ కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. నీలం మధు, కాటాశ్రీనివాస్ గౌడ్ రామలక్ష్మణుల్లా కలిసి పని చేస్తే మీ రాజకీయ భవిష్యత్ ను తాము చూసుకుంటానని హామీ ఇచ్చారు.

పటాన్ చెరును అభివృద్ధి చేస్తా -నీలం మ‌ధు
రేవంత్ రెడ్డి బడుగు, బలహీన వర్గాల పక్షపాతి అని, ఈ తాను స్థానికంగా పుట్టి పెరిగిన వ్యక్తిని. తన తల్లిదండ్రులు లేకపోయినా మీరే నాకు తల్లిదండ్రులు అని తనను ఆదరించి గెలిపించాలని మెదక్ కాంగ్రెస్ నీలం మధు అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమానత్వం కోసం పని చేసే పార్టీ అయితే బీజేపీ మతం పేరుతో, బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం పేరుతో ఓట్లు అడుగుతోందని విమర్శించారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతున్నదని ధీమా వ్యక్తం చేసిన నీలం మధు.. ఇక్కడ తనను ఎంపీగా గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో రాష్ట్రం నుంచి కేంద్రంలోని ఇండియా తరపు కేంద్రం నిధులతో పటాన్ చెరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement