Friday, November 22, 2024

MDK: డ్రగ్స్ ను తరిమికొట్టడంలో యువతదే కీలక పాత్ర.. ఎస్పీ చెన్నూరి రూపేష్

సంగారెడ్డి, ఆగస్టు 24 (ప్రభ న్యూస్) : మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా నిర్వహించిన ఫ్రీడం వాక్ లో జిల్లా ఎస్పీ ముఖ్య అతిధిగా హాజరై కలెక్టరేట్ నుండి కోర్టు కార్యాలయం వరకు యువతతో కలిసి 3 కిలో మీటర్ల వ‌ర‌కు ఫ్రీడం వాక్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… డ్రగ్ మహమ్మారిని తరిమికొట్టే ప్రక్రియలో భాగంగా జిల్లా పరిపాలన విభాగం, జిల్లా పోలీసు శాఖ, సహార హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం వాక్ లో సంగారెడ్డి పట్టణ ప్రజలు, ఔత్సాహికులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని, ఈ ఫ్రీడం వాక్ ను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సహార హాస్పిటల్స్ డైరెక్టర్ శంకర్, సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్య గౌడ్, యువజన సంఘాల నాయకులు కూన వేణు, సంగారెడ్డి నార్కోటెక్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రమేష్, యస్.బి ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇంటలిజెన్స్ డి.ఎస్.పి మురళి, సంగారెడ్డి టౌన్, రూరల్ ఇన్స్పెక్టర్స్, ఎస్సై సిబ్బంది, సహార హాస్పిటల్స్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement