అమీన్ పూర్ : యువకులే దేశానికి వెన్నెముక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు సాయి కాలనీలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించే తలపెట్టిన యువజన భవనం నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర సంగ్రమం నుండి మొదలుపెడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు యువకులే కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువజన సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, స్వయం ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రధానంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్ బాలమని బాలరాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement