సంగారెడ్డి : జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపట్టిన పనులను ఒక నెల లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శరత్ సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ రాజార్షి తో కలిసి 16వ లోక్ సభ పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల వినియోగం, పూర్తయిన పనులు, యూసి ల సమర్పణ తదితర అంశాలపై సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎంపీ ల్యాడ్స్ నిధులలో పనులు మంజూరు చేసినప్పటికీ, పనుల పురోగతి లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తయిన పనులకు సంబంధించి ఖర్చు వివరాల నివేదికను అందించాలని తెలిపారు. మంజూరైన పనులన్ని పూర్తి కావాలని స్పష్టం చేశారు. పనులను వేగవంతం చేయాలని, ఒక నెలలోగా ఎంపీ నిధులతో చేపట్టిన పనులు పూర్తి కావాలన్నారు. యూసీ లు (యుటిలైజేషన్ సర్టిఫికేట్ ) సబ్మిట్ చేయాలని సూచించారు. అదేవిధంగా పనులకు సంబంధించి రికన్ సిలేషన్ చేసుకోవాలని సిపిఓ కు సూచించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement