Tuesday, November 26, 2024

వామ్మో పులి.. వేట‌లో ఫారెస్ట్ అధికారులు

ప‌టాన్‌చెరు: జిన్నారం మండలం కాజిపల్లి అటవీ ప్రాంతంలో గత వారం రోజులుగా పులి కదలికలు పెరగడంతో అటవీశాఖ అధికారులు వాటి ఆచూకీ కోసం రంగంలోకి దిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గురువారం కాజిపల్లి అటవీ ప్రాంతంలో పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలిస్తూ జాడలు వెతికారు. ఒక్కసారిగా అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న వార్తలు గుప్పుమనడంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కాజిపల్లి అటవీ ప్రాంతంలో అక్కడక్కడ పులి కనిపించడంతో ఈ మేరకు ఫారెస్ట్ అధికారులు రంగ ప్రవేశం చేయడంతో ఇప్పటికైనా పులి బెడద తొలుగుతుందని ఆశిస్తున్నారు. ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామస్తులు శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement