Wednesday, November 20, 2024

వంట‌నూనె పంట‌ల‌ను ప్రోత్స‌హిస్తాం .. మంత్రి కేటీఆర్

వంట‌నూనె పంట‌ల‌ను ప్రోత్స‌హిస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. మెదక్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు. మొదట మనోహరాబాద్‌లో పర్యటించిన కేటీఆర్ అక్కడ ఐటీసీ ఉత్పత్తుల తయారీ పరిశ్రమను ప్రారంభించారు. అనంతరం ఐటీసీ పరిశ్రమలో ఏర్పాటు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు. రూ.450కోట్ల పెట్టుబడితో ఐటీసీ ఈ పరిశ్రమను నిర్మించింది. ఐజీబీసీ నుంచి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ ధ్రువీకరణ పొందింది. మనోహరాబాద్ పరిశ్రమ సిబ్బందిలో 50 శాతం మహిళలున్నారు.

పరిశ్రమ ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతుల ఆదాయం పెంచేందుకే నీలి విప్లం వచ్చిందని కేటీఆర్ అన్నారు. విజయ డెయిరీ ద్వారా రైతులకు ఆదాయం పెరుగుతోందని చెప్పారు. పరిశ్రమలు వచ్చినప్పుడు స్థానిక నేతలు సహకరించాలని కోరారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని నాలుగేండ్లలోనే పూర్తి చేశామన్నారు. 10 టీఎంసీల కాళేశ్వరం నీటిని పరిశ్రమలకు అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఇంటింటికీ మంచినీళ్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. మిషన్‌ కాకతీయతో 46 వేల చెరువులను బాగుచేశామని, దీంతో వ్యవసాయ స్థిరీకరణ, సాగుపెంపు సాధ్యమైందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులతో సాగువిస్తీర్ణం రెట్టింపయిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గొర్రెలు, మేకల సంఖ్య రెట్టింపయిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement