మెదక్: మంత్రి ఈటల రాజేందర్ పై వచ్చిన భూకబ్జా ఆరోపణలలపై నేటి ఉదయం విచారణ ప్రారంభమైంది… ఈ భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డిజి పూర్ణచందర్ రావుని సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించి ప్రాథమిక నివేదికను అందజేసి అనంతరం సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందజేయాల్సిందిగా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో నేటి ఉదయమే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు.. సిఐ సతీష్ అధ్వర్యంలోని బృందం ఇక్కడి అసైన్డ్ రైతుల నుంచి వివరాలు సేకరించే పనిని ప్రారంభించారు.. తమ అసైన్డ్ భూములను మంత్రి ఈటల, అయన అనుచురులు కబ్జా చేశారంటూ మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీం పేట్ గ్రామాలకు చెందిన 8మంది రైతులు చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగు లు, చాకలి పరశురాం, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేరుగా ఫిర్యాదు చేశారు. తమ భూములు కబ్జాచేశారని, ఆక్రమించి రోడ్లు వేశారని.. తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని లేఖలో పేర్కొన్నారు. కబ్జా చేసిన భూ ముల్లో హ్యాచరీస్ కోసం షెడ్ల నిర్మాణం చేపట్టినట్లు బాధిత రైతులు తెలిపారు. ప్రశ్నిస్తే తమ భూములకు దారి లేకుండా చేస్తామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు చెప్పారు. భూమి పత్రాలను సైతం దౌర్జ న్యంగా లాక్కున్నారని ఆరోపించారు. ఈటలతో పాటు ఆయన అనుచరులు సూరి అలియాస్ అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్‌రెడ్డి కబ్జాకాండ సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు.. ఈ ఫిర్యాదు ఆధారంగా అచ్చంపేటలో విజిలెన్స్ బృందం విచారణ చేపట్టింది.. ముందుగా ఫిర్యాదు చేసిన రైతుల నుంచి విచారణ ప్రారంభించారు.. అచ్చంపేటలో తుప్రాన్ ఆర్డీవో రాంప్రకాశ్ ఆధ్వర్యంలో అధికారులు భూములను సర్వే చేస్తున్నారు. తుప్రాన్ డీఎస్పీ కిరణ్ కుమార్ నేతృత్వంలో మంత్రి ఈట ఫామ్ హౌస్ సమీపంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో ఈ గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు..
ఈటల భూకబ్జాపై అచ్చంపేటలో విజిలెన్స్ విచారణ ప్రారంభం….
By sree nivas
- Tags
- begins
- Eatala
- inquiry
- land grabbing
- medak live news
- medak local news
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement