Tuesday, November 26, 2024

కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి..

మెదక్‌ : కరోనా తీవ్రతను నియంత్రించడంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ జిల్లా కలెక్టర్‌లకు ఆదేశించారు. హైదరాబాద్‌ నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఎంఅండ్‌హెచ్‌ఓలు, జడ్పీ సీఈఓలు, డిఆర్‌డివోలు, డిపివోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత కొనసాగుతున్న దృష్టా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలు వ్యాక్సిన్‌ పంపిణీ, కోవిడ్‌ టెస్ట్‌లు తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రెవెన్యూ, పోలీస్‌, వైద్య ఆరోగ్యశాఖ, మండల స్థాయి అధికారులు అన్ని వేళల అప్రమత్తంగా ఉండాలన్నారు. రోజువారి చేస్తున్న కోవిడ్‌ టెస్టులను పెంచాలని, పాజిటీవ్‌ కేసులు, కాంటాక్టు కేసులను గుర్తించాలన్నారు. సంబంధితులను హోం ఐసోలేషన్‌లో ఉంచాలని సూచించారు. లక్ష్యం మేరకు వ్యాక్సిన్‌ ఇస్తున్నామని 45 సంవత్సరాలు పై బడిన వారందరికీ అవగాహన కల్పించి వ్యాక్సిన్‌ అందిస్తున్నామన్నారు. అన్ని రోజులలో వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందన్నారు. కోవిడ్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టీకా వేయించుకోవడానికి ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని, ప్రతి గ్రామపంచాయతీలో అవగాహన కలిస్తున్నామని, ఎంతమంది వచ్చినా టీకా ఇచ్చుటకు సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రమేష్‌, డిఎం అండ్‌హెచ్‌ఓ వెంకటేశ్వరరావు, జడ్పీ సీఈవో శైలేష్‌, డీఆర్డీఓ శ్రీనివాస్‌, డిపిఓ తరుణ్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement