Friday, November 22, 2024

వరిసాగు..

చేగుంట : మండలం మక్కరాజ్‌పేట రెవెన్యూ సెక్టార్‌ పరిధిలో రబీసీజన్‌లో 2367 ఎకరాల్లో వరిసాగు చేసినట్లు సెక్టార్‌ అధికారి ఏఈఓ మాధవి పేర్కొన్నారు. సెక్టార్‌ పరిధిలో మక్కరాజ్‌పేట, గొల్లపల్లి, జైతురామ్‌తాండా, రామాపూర్‌, సోమ్లాతాండా, కరీంనగర్‌, గ్రామపంచాయతీలతో పాటు కర్నాల్‌పల్లి గ్రామానికి చెందిన కొంత మంది రైతులు ఉన్నారు. ఖరీఫ్‌ సీజన్లో వర్షాలు సమృద్దిగా కురిసిన, రబీసీజన్‌లో భూగర్బ జలాల నీటి మట్టం తగ్గిందని మాధవి వెళ్లడించారు. పంటలు చేతికందే సమయంలో అక్కడక్కడ నీరందక పంటలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లా అధికారుల సూచన మేరకు రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నీటి నిల్వ చేసుకోవడానికి రైతులు ట్యాంకులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ విషయాన్ని గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్పడం జరిగిందని మాధవి పేర్కొన్నారు. పది రోజుల్లో వరి కోతల సీజన్‌ ప్రారంభం అవుతుందని, ముందు నాట్లు వేసిన పంటలు చేతికందుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement