మెదక్ : మండల పరిధిలోని మంబోజిపల్లిలో వరికొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్ ఛైర్మన్ హన్మంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుదన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. వడ్లలో తేమశాతం 17 మించకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ ప్రభాకర్, ఉపసర్పంచ్ సత్తయ్య, ఎంపిటిసి మ్యాకల మానసరాములు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement