హవేళిఘణపూర్ : మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో వరిధాన్యం కొనుగోలులో మొదటి జిల్లా కావాలని ఆమె అన్నారు. రైతులు నాణ్యమైన వరిధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని ఆమె సూచించారు. చివరి వరకు ప్రతి గింజను కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని.. అపోహలు విని రైతులు దళారుల చేతిలో మోసపోకూడదని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ లావణ్యరెడ్డి, జడ్పీటిసి సుజాత శ్రీనివాస్‌రెడ్డి, ఎంపిపి నారాయణరెడ్డి, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షులు మాణిక్యరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్‌నాయక్, నాగమాధురి, సర్పంచ్ రేణుక రమేష్, ఏఈఓ ప్రశాంత్, సొసైటీ డైరెక్టర్ రాంరెడ్డి, ఉపసర్పంచ్ బాలయ్య, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే..
By sree nivas
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement